Posts

ఆంధ్ర అబ్బాయి, తెలంగాణ అమ్మాయి - Part 2

 శివ లోపలికి వచ్చి తన సీటు లో కూర్చున్నప్పుడు శ్రావణి వైపు చూశాడు, తాను మాట్లాడాలి అనుకుంటుoది అని అర్ధం అయింది శివ కి, ఇంతలో ఫోన్ రింగ్ అయింది, వాళ్ల అమ్మ ఫోన్ చేస్తుంది, లిఫ్ట్ చేసి హలో చెప్పు అమ్మ అన్నాడు, ఎక్కడి వరకు వెళ్లావు ఎమైన తిన్నవా అని ప్రశ్నలు అడిగింది, తినలేదు తినాలి మీరు తిన్నారా అన్నాడు,తిన్నము లే కానీ, మీ నాన్న కు చెప్పకుండా ఎందుకు వెళ్లావు ఆయన రాత్రి తాగి వచ్చి పెద్ద గొడవ చేస్తాడు, తండ్రి తో నీకు అంత ఏంటి అని అంటూ ఉంటే, శివ కి తన వల్లే మన జీవితాలు ఇలా తయారు అయ్యాయి అని అనాలీ అని నోటి వరకు వచ్చి ఆగిపోయి, ఇంకొక సారి ఆయన ప్రస్తావన నా దగ్గరకు తీసుకురాకు అమ్మ అని ఫోన్ పెట్టేసాడు...ఈ మాటలు విన్న శ్రావణి కి శివ తో మాట్లాడాలి అన్న ఆలోచన ఆగిపోయింది. శివ కి ఇంటి దగ్గర పరిస్తితి గుర్తుకు వచ్చి బాధతో కళ్లు మూసుకున్నాడు. ఇంతలో ఫుడ్ ఆర్డర్ అని రైల్వే సర్వీస్ బాయ్ అడిగాడు, శివ నాకేమీ వద్ధు అని చేతితో సిగ్నల్ ఇచ్చాడు, శ్రావణి తనకు ఎమ్ కావాలో హిందీ లో ఆర్డర్ చెప్పింది. ఇది విన్న శివ కి డౌట్ వచ్చింది,.. శ్రావణి తెలుగు ఆ లేక హిందీ నా అని, అప్పుడే శ్రావణి ఫోన్ రింగ్ అయింది, "ఇంతలో ఎన...

ఆంధ్ర అబ్బాయి, తెలంగాణ అమ్మాయి Part -1

30 గంటల రైలు ప్రయాణం ఉదయాన్నే 6 గంటలకు హైదరాబాద్ లో మొదలైంది, సైడ్ బెర్త్ ఎదురెదురుగా కూర్చున్న ఆంధ్ర అబ్బాయి, తెలంగాణ అమ్మాయి...... ప్రయాణం మొదలైంది బయట చిరు జల్లుల వర్షం కురుస్తూ అప్పుడప్పుడు చల్లగాలి బలంగా  వీస్తుంది. తన బ్యాగ్ లో ఉన్న స్వెట్టర్ తీసి అమ్మాయి వేసుకుని కూర్చుంది. ఈ మధ్యలో చూసి చూడనట్టుగా అబ్బాయి మరియు అమ్మాయి కళ్లు తిప్పుకొన్నారు.ఇంతలో తలో అబ్బాయి తన బ్యాగ్ లో ఉన్న చిన్న ఫ్లాస్కు తీసుకొని ఒక చిన్న పేపర్ గ్లాస్ తీసి ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న టీ గ్లాస్ లో పోస్తూ ఉంటే ఆ స్మెల్ ఒక్కసారిగా ఇంటి దగ్గర వాళ్ల అమ్మ చేసిన టీ అమ్మాయికి గుర్తొచ్చింది, ఆ చల్లగాలి కి ఆ వాతావరణం కి అతను అలా టీ తాగుతూ ఉంటే, అమ్మాయి తనకి కూడా ఇవ్వమని అడిగే అంతా కోరిక ఉన్నా మనసు చంపుకొని ఆగిపోయింది. అలా చాలాసేపు ఒకరినొకరు చూసుకుంటున్నారు కానీ ఎవరూ మాట్లాడడానికి ధైర్యం చేయటం లేదు..ఇంతలో TC వచ్చి టికెట్ నంబర్స్ చెక్ చేస్తూ 43 శ్రావణి అన్నాడు వెంటనే అమ్మాయి టికెట్ చూపించినది. తర్వాత 44 శివ అంటే అబ్బాయి టికెట్ చూపించాడు. అలా ఒకరి పేరు ఒకరికి తెలిసి పోయింది. అలా నాలుగైదు స్టేషన్ లు దాటేసరికి తెలుగు వ...