ఆంధ్ర అబ్బాయి, తెలంగాణ అమ్మాయి Part -1
30 గంటల రైలు ప్రయాణం ఉదయాన్నే 6 గంటలకు హైదరాబాద్ లో మొదలైంది, సైడ్ బెర్త్ ఎదురెదురుగా కూర్చున్న ఆంధ్ర అబ్బాయి, తెలంగాణ అమ్మాయి...... ప్రయాణం మొదలైంది బయట చిరు జల్లుల వర్షం కురుస్తూ అప్పుడప్పుడు చల్లగాలి బలంగా వీస్తుంది. తన బ్యాగ్ లో ఉన్న స్వెట్టర్ తీసి అమ్మాయి వేసుకుని కూర్చుంది. ఈ మధ్యలో చూసి చూడనట్టుగా అబ్బాయి మరియు అమ్మాయి కళ్లు తిప్పుకొన్నారు.ఇంతలో తలో అబ్బాయి తన బ్యాగ్ లో ఉన్న చిన్న ఫ్లాస్కు తీసుకొని ఒక చిన్న పేపర్ గ్లాస్ తీసి ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న టీ గ్లాస్ లో పోస్తూ ఉంటే ఆ స్మెల్ ఒక్కసారిగా ఇంటి దగ్గర వాళ్ల అమ్మ చేసిన టీ అమ్మాయికి గుర్తొచ్చింది, ఆ చల్లగాలి కి ఆ వాతావరణం కి అతను అలా టీ తాగుతూ ఉంటే, అమ్మాయి తనకి కూడా ఇవ్వమని అడిగే అంతా కోరిక ఉన్నా మనసు చంపుకొని ఆగిపోయింది. అలా చాలాసేపు ఒకరినొకరు చూసుకుంటున్నారు కానీ ఎవరూ మాట్లాడడానికి ధైర్యం చేయటం లేదు..ఇంతలో TC వచ్చి టికెట్ నంబర్స్ చెక్ చేస్తూ 43 శ్రావణి అన్నాడు వెంటనే అమ్మాయి టికెట్ చూపించినది. తర్వాత 44 శివ అంటే అబ్బాయి టికెట్ చూపించాడు. అలా ఒకరి పేరు ఒకరికి తెలిసి పోయింది. అలా నాలుగైదు స్టేషన్ లు దాటేసరికి తెలుగు వ...