ఆంధ్ర అబ్బాయి, తెలంగాణ అమ్మాయి - Part 2
శివ లోపలికి వచ్చి తన సీటు లో కూర్చున్నప్పుడు శ్రావణి వైపు చూశాడు, తాను మాట్లాడాలి అనుకుంటుoది అని అర్ధం అయింది శివ కి, ఇంతలో ఫోన్ రింగ్ అయింది, వాళ్ల అమ్మ ఫోన్ చేస్తుంది, లిఫ్ట్ చేసి హలో చెప్పు అమ్మ అన్నాడు, ఎక్కడి వరకు వెళ్లావు ఎమైన తిన్నవా అని ప్రశ్నలు అడిగింది, తినలేదు తినాలి మీరు తిన్నారా అన్నాడు,తిన్నము లే కానీ, మీ నాన్న కు చెప్పకుండా ఎందుకు వెళ్లావు ఆయన రాత్రి తాగి వచ్చి పెద్ద గొడవ చేస్తాడు, తండ్రి తో నీకు అంత ఏంటి అని అంటూ ఉంటే, శివ కి తన వల్లే మన జీవితాలు ఇలా తయారు అయ్యాయి అని అనాలీ అని నోటి వరకు వచ్చి ఆగిపోయి, ఇంకొక సారి ఆయన ప్రస్తావన నా దగ్గరకు తీసుకురాకు అమ్మ అని ఫోన్ పెట్టేసాడు...ఈ మాటలు విన్న శ్రావణి కి శివ తో మాట్లాడాలి అన్న ఆలోచన ఆగిపోయింది. శివ కి ఇంటి దగ్గర పరిస్తితి గుర్తుకు వచ్చి బాధతో కళ్లు మూసుకున్నాడు. ఇంతలో ఫుడ్ ఆర్డర్ అని రైల్వే సర్వీస్ బాయ్ అడిగాడు, శివ నాకేమీ వద్ధు అని చేతితో సిగ్నల్ ఇచ్చాడు, శ్రావణి తనకు ఎమ్ కావాలో హిందీ లో ఆర్డర్ చెప్పింది. ఇది విన్న శివ కి డౌట్ వచ్చింది,.. శ్రావణి తెలుగు ఆ లేక హిందీ నా అని, అప్పుడే శ్రావణి ఫోన్ రింగ్ అయింది, "ఇంతలో ఎన...