ఆంధ్ర అబ్బాయి, తెలంగాణ అమ్మాయి - Part 2
శివ లోపలికి వచ్చి తన సీటు లో కూర్చున్నప్పుడు శ్రావణి వైపు చూశాడు, తాను మాట్లాడాలి అనుకుంటుoది అని అర్ధం అయింది శివ కి, ఇంతలో ఫోన్ రింగ్ అయింది, వాళ్ల అమ్మ ఫోన్ చేస్తుంది, లిఫ్ట్ చేసి హలో చెప్పు అమ్మ అన్నాడు, ఎక్కడి వరకు వెళ్లావు ఎమైన తిన్నవా అని ప్రశ్నలు అడిగింది, తినలేదు తినాలి మీరు తిన్నారా అన్నాడు,తిన్నము లే కానీ, మీ నాన్న కు చెప్పకుండా ఎందుకు వెళ్లావు ఆయన రాత్రి తాగి వచ్చి పెద్ద గొడవ చేస్తాడు, తండ్రి తో నీకు అంత ఏంటి అని అంటూ ఉంటే, శివ కి తన వల్లే మన జీవితాలు ఇలా తయారు అయ్యాయి అని అనాలీ అని నోటి వరకు వచ్చి ఆగిపోయి, ఇంకొక సారి ఆయన ప్రస్తావన నా దగ్గరకు తీసుకురాకు అమ్మ అని ఫోన్ పెట్టేసాడు...ఈ మాటలు విన్న శ్రావణి కి శివ తో మాట్లాడాలి అన్న ఆలోచన ఆగిపోయింది. శివ కి ఇంటి దగ్గర పరిస్తితి గుర్తుకు వచ్చి బాధతో కళ్లు మూసుకున్నాడు. ఇంతలో ఫుడ్ ఆర్డర్ అని రైల్వే సర్వీస్ బాయ్ అడిగాడు, శివ నాకేమీ వద్ధు అని చేతితో సిగ్నల్ ఇచ్చాడు, శ్రావణి తనకు ఎమ్ కావాలో హిందీ లో ఆర్డర్ చెప్పింది. ఇది విన్న శివ కి డౌట్ వచ్చింది,.. శ్రావణి తెలుగు ఆ లేక హిందీ నా అని, అప్పుడే శ్రావణి ఫోన్ రింగ్ అయింది, "ఇంతలో ఎన్నెన్నో వింతలో" రింగ్ టోన్ వినిపించే సరికి, శివ కి తాను తెలుగు అమ్మాయి ఏ అని అర్ధం అయింది. కానీ శ్రావణి తమిళ్ బాష లో మాట్లాడింది, శివ నిజంగా ఇంతలో ఎన్ని ఎన్ని వింతలో అనుకున్నాడు,... కొద్ది సేపటికి ఫుడ్ వచ్చింది, శ్రావణి ఓపెన్ చేసి తింటూ ఫార్మాలిటీ గా మీరు తిన్నారా అని అడిగే లోపు,. శివ కింద నుండి ఒక పెద్ద బ్యాగ్ తీశాడు, అందులో ఒక మినీ సైజ్ కిరాణా షాప్ ఏ ఉంది, అధి చూసి శ్రావణి లోలోపల మంచి ప్రీపరేషన్ తో వచ్చాడు అని నవ్వుకుంది, శివ బ్రెడ్ జామ్ ఓపెన్ చేసి తినడం స్టార్ట్ చేశాడు, శ్రావణి తింటూ ఫుడ్ బాక్స్ లో ఉన్న చట్నీ ప్యాకెట్ గట్టిగా ఓపెన్ చేస్తే అధి స్లిప్ అయి శివ సీటు వరకు పడింది, శివ తనకు తెలియకుండానే కోపంగా చూశాడు, అది చూసి శ్రావణి వామ్మో అనుకోని sorry అని చెప్పింది, శివ నవ్వుతూ it's ఓకే అన్నాడు, ఏంటి కొంచెం అపరిచితుడు లా ఉన్నాడు అని శ్రావణి మనసులో అనుకుంది,... ఇద్దరు తినడం అయిపోయింది, టైమ్ మద్యాహ్నం రెండు అయింది, ఇద్దరు కూర్చొని అలా నిద్రలో కి జారుకున్నారు, ఒక గంట తరవాత శివ కి మేలుకు వచ్చింది, ట్రైన్ నిదానముగా move అవుతుంది. ఏదో కొండ ప్రాంతం లో వెళుతుంది, చూడటానికి బయట ప్రకృతి చాలా అందంగా ఉంది, శివ అలా చూస్తూ ఉండి పోయాడు, ఇంతలో శ్రావణి కి కూడా మెలకువ వచ్చింది, కొన్ని నిమిషాలకు ట్రైన్ వాటర్ filling కోసం ఒక స్టేషన్ లో ఆగింది, శివ వెంటనే కిందికి దిగాడు, తనకి కిందికి దిగి ఎక్కలి అనిపించి డోర్ వరకు వచ్చింది కానీ దైర్యం సరిపోక శివ వైపు చూసింది శ్రావణి... ట్రైన్ లో నుంచి కిందకు దిగుధామ వద్ధా అని బాగ ఆలోచిస్తూ ఉంది, ఇంతలో తన చిన్న తనం నుంచి రైలు ప్రయాణం చేసిన ఒక్కసారి కూడా కనీసం డోర్ వరకు కూడా family వాళ్ళు రానివ్వలేదు, అది గుర్తుకు వచ్చి కిందికి దిగుధాము అని నిర్ణఇంచుకొని ఒక స్టెప్ కిందికి వేసింది, ఇంతలో శివ దిగవద్దు అని సైగ చేశాడు, ఒక్కసారి గా ఎందుకో అని అర్దం కాక వెనక్కి వచ్చింది, ఇంతలో ట్రైన్ హార్న్ కొట్టి స్లోగా move అయింది, శ్రావణి దిగుతున్నప్పుడే గ్రీన్ సిగ్నల్ కనిపించి శివ వద్దు అని అన్నాడు, ట్రైన్ move అవుతూ ఉంటే శివ రన్నింగ్ ట్రైన్ ఎక్కాడు... శ్రావణి కిందికి దిగి ఉంటే మళ్లీ ఎక్కి ఉండేదాన్ని కాదు ఏమో అనుకోని వెళ్లి సీటు లో కూర్చొని, శివ కి థాంక్స్ చెప్పాలి అనుకున్నది. ఇంతలో శివ లోపలికి ఎక్కి సిగ్నల్ గురించి చెప్పాలి అనుకొనే లోపు, శ్రావణి అటు వైపు నుంచి థాంక్స్ అండీ కిందికి దిగి ఉంటే ఇబ్బంది పడేదాన్ని అని చెప్పింది... శివ ఒక్కసారి గా తన వాయిస్ క్లియర్ గా వినటం, తాను తెలుగు మాట్లాడటం చూసి ఒక్క సెకను ఆగిపోయాడు, తరవాత తన మాటలు గుర్తుకు వచ్చి పర్లేదు అన్నాడు, తరవాత శివ మరియు శ్రావణి ఒకేసారి ఓకే టైమ్ లో ఎక్కడి వరకు అన్నారు, ఒక సెకండ్ ఇద్దరు ఆగిపోయారు, మళ్లీ వెంటనే ఇద్దరు శివ ఢిల్లీ అని శ్రావణి న్యూ ఢిల్లీ అని ఒకేసారి ఇద్దరు అన్నారు, ఇద్దరు చిన్న నవ్వు నవ్వారూ..... టైమ్ మద్యాహ్నం మూడు అయింది కొంచెం చల్లగా ఉంది వాతావరణం, ట్రైన్ చాలా వేగంగా వెళుతుంది, ఇంతలో శివ మళ్లీ బ్యాగ్ తీశాడు, అది చూసి శ్రావణి కి నవ్వు ఆగలేదు, అది శివ గమనించాడు, శ్రావణి అతి కష్టం మీద నవ్వు ఆపుకుంది, శివ మళ్లీ యథా విధిగా తన ఫ్లాస్కు ఓపెన్ చేసి పొద్దున మిగిలిపోయిన టీ ప్లాస్టిక్ గ్లాస్ లో పోస్తూ శ్రావణి వైపు చూస్తూ, తాగుతార అన్నట్టు సైగ చేశాడు, తాగలీ అడగాలి అని ఉన్న వద్దులే అండీ అని చెప్పింది, మనసులో ఇంకో సారి అడిగితే తాగుధం అనుకున్నది.కానీ శివ ఇంకో సారి అడగకుండా తాగడం స్టార్ట్ చేశాడు, శ్రావణి మనసులో waste fellow అనుకుంది, కానీ మళ్లీ మనసులో అతనే అడిగాడు మనమే వద్దు అని అన్నది నేనే తన తప్పు ఎమ్ లేదులే అనుకుంది, కొద్ది సేపటికి కాఫీ కాఫీ అంటూ అమ్మేవాడు వచ్చాడు, శ్రావణి టీ ఉందా అని అడిగింది, అతను లేదు అన్నాడు,శివ శ్రావణి వైపు ఒక విచిత్ర చూపు చూస్తూ "ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే" అని ఇందుకు అన్నారేమో అని అనుకున్నాడు. శ్రావణి శివ వైపు చూస్తూ ఏదో ఒక చిన్న తప్పు చేసి దొరికినట్టు ఫేస్ పెట్టింది. ఇంతలో టీ లేదు కాఫీ మాత్రమే ఉంది అని అమ్మేవాడు అన్నాడు,... శివ ఈ సారి ఫ్లాస్కు ఓపెన్ చేసి టీ ఒక గ్లాసు లో పోసి తనకి ఇస్తూ, తీసుకోండి అంతా ఇష్టం ఉంటే మనసు చంపుకోవటం ఎందుకు, నేనేమీ కిడ్నాప్ చేసేవాడిని కాదులే అన్నాడు,.. శ్రావణి ఈసారి తీసుకోక పోతే బాగోదు అని, అలా కాదు అండీ ఏదో మాట వరసకు అడిగారు లే అని వద్ధు అన్నాను అని చెప్పి తీసుకొని ఒక సిప్ తాగింది, ఇంటి టీ తాగడంతో ఒక్కసారిగా refresh అయినట్లు అనిపించింది, చాలా బాగుంది అని చెప్పింది, దానికి శివ కొంచెం నవ్వుతూ ఇంకా అయిపోయింది మళ్లీ అడగకండి అన్నాడు....
Part 3 in Next Article...❤️
Thanks for Watching 🙏
Comments
Post a Comment