ఆంధ్ర అబ్బాయి, తెలంగాణ అమ్మాయి Part -1
30 గంటల రైలు ప్రయాణం ఉదయాన్నే 6 గంటలకు హైదరాబాద్ లో మొదలైంది, సైడ్ బెర్త్ ఎదురెదురుగా కూర్చున్న ఆంధ్ర అబ్బాయి, తెలంగాణ అమ్మాయి......
ప్రయాణం మొదలైంది బయట చిరు జల్లుల వర్షం కురుస్తూ అప్పుడప్పుడు చల్లగాలి బలంగా వీస్తుంది. తన బ్యాగ్ లో ఉన్న స్వెట్టర్ తీసి అమ్మాయి వేసుకుని కూర్చుంది. ఈ మధ్యలో చూసి చూడనట్టుగా అబ్బాయి మరియు అమ్మాయి కళ్లు తిప్పుకొన్నారు.ఇంతలో తలో అబ్బాయి తన బ్యాగ్ లో ఉన్న చిన్న ఫ్లాస్కు తీసుకొని ఒక చిన్న పేపర్ గ్లాస్ తీసి ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న టీ గ్లాస్ లో పోస్తూ ఉంటే ఆ స్మెల్ ఒక్కసారిగా ఇంటి దగ్గర వాళ్ల అమ్మ చేసిన టీ అమ్మాయికి గుర్తొచ్చింది, ఆ చల్లగాలి కి ఆ వాతావరణం కి అతను అలా టీ తాగుతూ ఉంటే, అమ్మాయి తనకి కూడా ఇవ్వమని అడిగే అంతా కోరిక ఉన్నా మనసు చంపుకొని ఆగిపోయింది. అలా చాలాసేపు ఒకరినొకరు చూసుకుంటున్నారు కానీ ఎవరూ మాట్లాడడానికి ధైర్యం చేయటం లేదు..ఇంతలో TC వచ్చి టికెట్ నంబర్స్ చెక్ చేస్తూ 43 శ్రావణి అన్నాడు వెంటనే అమ్మాయి టికెట్ చూపించినది. తర్వాత 44 శివ అంటే అబ్బాయి టికెట్ చూపించాడు. అలా ఒకరి పేరు ఒకరికి తెలిసి పోయింది. అలా నాలుగైదు స్టేషన్ లు దాటేసరికి తెలుగు వాళ్ళు అందరూ దిగారు, అందరూ హిందీ వాళ్లే ఎక్కారు, చూడటానికి కొంచెం వింతగా ఉండేసరికి శ్రావణి కి కొంచెం భయం స్టార్ట్ అయింది.వేరే స్టేట్ వాళ్ళని చూసి కొద్దిగా భయపడ్డ శ్రావణి కి ఇంటి దగ్గర అమ్మ, బంధువులు అన్న మాటలు గుర్తుకు వచ్చాయి..., అంత దూరం ఒక్కదానివే ఎలా వెళ్తావు, నువ్వు వెళ్ళలేవు ఆగిపో అని చివరి నిమిషం వరకు ఆపే ప్రయత్నం చేసిన ఎవరి మాట వినకుండా మొండి పట్టు పట్టి బయలుదేరింది శ్రావణి. ట్రైన్ ఎక్కించే ముందు వాళ్ల నాన్న శ్రావణి తో మాట్లాడుతూ అన్నాడు "నా కూతురు నీ ఒంటరి గా పంపుతున్నా ఇంత మంది వద్ధు అన్న ముందుకు వెళ్తున్నావు అంటే ముగించుకుని వస్తావు అని నీ మీద నమ్మకం ఉంది" అని నాన్న అన్న మాటలు గుర్తుకు వచ్చి కన్నీళ్లు తన్నుకొని వచ్చాయి.కన్నీళ్లు తుడుచుకుంటున్నా శ్రావణి ని చూసి ఎమ్ అయింది అని అడగాలి అనుకున్న శివ ఎందుకో ఆగిపోయాడు. ఇంతలో ట్రైన్ క్రాస్ అని ఆగిపోయింది బయట దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి భారీ వర్షం మొదలైంది. శివ వెంటనే కిటికీ మూసేసుకున్నాడు, శ్రావణి ప్రయత్నం చేస్తున్నా అది తుప్పు పట్టడం వల్ల రావడం లేదు, ఇంకా చేసేదిలేదని శివ వైపు చూసింది, అక్కడ ఏమీ జరగక పోయినా శివ కి అర్ధం అయింది తానే కిటికీ మూసివేయాలని ముందుకు కదిలాడు. తాను ప్రయత్నం చేస్తున్నాడు అని తెలిసి శ్రావణి పక్కకు జరిగింది, శివ తన బలాన్ని మొత్తం ఉపయోగించిన ఇంచు కూడా కదలలేదు, ఇంకా ఎలా అని ఆలోచిస్తూ శ్రావణి వైపు చూశాడు, తాను నవ్వలేదు కాని శివ కి అలా అనిపించి పరువు పోయినట్టు ఫీల్ అయ్యి గట్టిగా ఒక్కసారి ప్రయత్నించాడు అంతే పెద్ధ శబ్ధం చేస్తూ కిందికి పడిపోయింది కిటికీ ఆ వేగానికి తన వేలు మీద పడింది కిటికీ, తనకు నొప్పి అనిపించిన అరవకుండా అలానే ఉన్నాడు శివ, అది గమనించిన శ్రావణి ఎమ్ అయింది అని అడిగే లోపు శివ ఏమీ కానట్టు వెళ్లి తన సీటు లో కూర్చున్నాడు. పెద్ధ దెబ్బ ఎమైన తగిలిందా అని తన వెళ్లను చూసింది, చిన్న గాయం అయింది అని తెలిసి Are you okay అని అడిగింది, శివ I am fine అన్నాడు, శ్రావణి కి బాధ అనిపించింది తన వల్ల దెబ్బ తగిలింది అని. కొద్ది సేపటికి వర్షం తాగినట్టు అనిపించి శివ కిందకు దిగాడు, ఇంతలో అందరూ కిటికిలు ఓపెన్ చేస్తుంటే శ్రావణి కూడా ఓపెన్ చేసింది, తరవాత శివ వేళ్లు చూసుకోవడం గమనించింది. అది చూసి శివ మళ్లీ ఏమీ కానట్టు ఉండిపోయాడు. శ్రావణి మనసులో దెబ్బ గట్టిగా తగిలినట్టు ఉంది ఎమ్ అయింధో అడగాలి అనుకుంది. ఇంతలో ట్రైన్ హార్న్ కొట్టడంతో శివ పైకి వచ్చేసాడు.
PART - 2 in Next Article...
Comments
Post a Comment